గుజరాత్‌లో ‘ఆప్’కు కొత్త కష్టాలు.. బీజేపీకి మద్దతు ఇస్తానన్న ఎమ్మెల్యే!
- గుజరాత్‌లో ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు
- బీజేపీకి బయటి నుంచి మద్దతునిస్తానన్న విశ్వదర్ ఆప్ ఎమ్మెల్యే
- మిగతా వారిని రక్షించుకునే పనిలో ఆప్ అధిష్ఠానం
జునాగఢ్ జిల్లాలోని విశ్వదర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆప్ ఎమ్మెల్యే భూపత్ భయానీ బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఈ వార్తలను ఆయన ఖండించారు. తాను అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని, కానీ ప్రజాభిప్రాయం తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరబోనన్న భూపత్.. ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తానని పేర్కొనడం గమనార్హం. దీంతో ‘ఆప్’ అధిష్ఠానం మిగతా ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది.