crocodile: ఇదేం సరదానో..! మొసలి వేషం వేసుకొని, నది ఒడ్డున మొసలినే ఆట పట్టించిన వ్యక్తి.. వీడియో ఇదిగో!

Man Wears Crocodile Costume And Teases Reptile Internet Shocked
షార్ట్స్‌లో చూడండి
కొంత మంది సరదా కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు. అలాంటి కోవకే చెందిన ఓ వ్యక్తి మొసలి వేషం వేసుకొని, నిజమైన మొసలిని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  పది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను నరేంద్ర సింగ్ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నది ఒడ్డు దగ్గర మొసలి ఉండగా.. ఓ వ్యక్తి అచ్చం మొసలిని పోలి ఉన్న వేషం ధరించి నిజమైన మొసలి పక్కనే పడుకున్నాడు.
 
నిజమైన మొసలి ముందుకెళ్తుండగా.. చేత్తో దాన్ని తాకుతూ ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. ‘ఈ వ్యక్తి ఏ మందు తాగాడో’ అనే ట్యాగ్ లైన్ తో నరేంద్ర సింగ్ షేర్ చేసిన ఈ వీడియోను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి ‘మొసలి చేష్టల’పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ధైర్యానికి, మూర్ఖత్వానికి మధ్య చిన్న గీత మాత్రమే ఉంటుందని ఓ యూజర్ ఎద్దేవా చేశాడు. చావడానికి సృజనాత్మక మార్గం ఎంచుకున్నాడని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు.
Go Back to Shorts
crocodile
man
Costume
Social Media
Viral Videos

More Telugu News