ఐపీఎల్ లో 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ భారత ఆటగాళ్లకే వర్తిస్తుందట!
- ఐపీఎల్ లో కొత్త రూల్
- ఇంపాక్ట్ ప్లేయర్ పేరిట సబ్ స్టిట్యూట్ విధానం
- సబ్ స్టిట్యూట్ తో బౌలింగ్, బ్యాటింగ్ చేయించే వెసులుబాటు
- విదేశీ ఆటగాళ్లకు వర్తించని వెసులుబాటు
అయితే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై మరింత స్పష్టత వచ్చింది. ఆయా జట్లు సబ్ స్టిట్యూట్ గా తీసుకునే ఆటగాడు భారత్ ఆటగాడై ఉండాలి. విదేశీ ఆటగాళ్లను సబ్ స్టిట్యూట్ గా ఉపయోగించుకోవడం కుదరదు.
ఐపీఎల్ లో తుది జట్లలో కేవలం నలుగురు విదేశీ ఆటగాళ్లనే తీసుకోవాలన్నది ఓ నిబంధనగా ఉంది. ఇప్పుడు సబ్ స్టిట్యూట్ రూపంలో విదేశీ ఆటగాళ్లను తీసుకుంటే నలుగురు ఆటగాళ్ల నిబంధనకు విఘాతం ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను కేవలం భారత ఆటగాళ్లకే వర్తింపజేసేలా బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి అమల్లోకి రానుంది.