జంతువుల్లా కనిపిస్తారు.. కానీ మనుషులే.. ఆనంద్ మహీంద్రా మెచ్చిన వీడియో ఇదిగో!
- పక్షులు, సింహం, పులిగా మారిపోయిన మనుషులు
- శరీరంపై పెయింట్ వేసుకుని వాటిని మరిపించే విధంగా భంగిమలు
- ట్విట్టర్ లో షేర్ చేసిన మహీంద్రా గ్రూప్ చైర్మన్
శరీరంపై జంతు ఆకారాలను పెయింట్ గా వేసుకుని.. శరీర అవయవాలను పక్షులు, జంతువుల మాదిరి ఆకారంలోకి వంపు చేసి... అచ్చం పక్షి లేదా జంతువు అని భ్రమ పడేలా చేయడం సాధారణమైనది కాదు. ఓ టాలెంట్ హంట్ షోలో భాగంగా కళాకారులు ఈ విన్యాసాలు చేశారు. ‘‘అద్భుతం.. శుక్రవారం అడవిలో ఉన్నట్టుంది. చివరి దాని కోసం వేచి చూడండి’’ అని ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ పెట్టారు. వీడియో చివర్లో పెద్ద పులి దర్శనమిస్తుంది. అది కూడా ఓ కళాకారుడి కృషి అని తెలుస్తుంది. ఇప్పటికే దీన్ని 4 లక్షల మందికి పైగా వీక్షించారు.