9 నుంచి 11 వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఇటీవల అర్థాంతరంగా ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్
- ఈ నెల 10, 11 తేదీల్లో మళ్లీ నిర్వహణ
- ఖైరతాబాద్ నుంచి ఐమ్యాక్స్, తెలుగు తల్లి కూడలి వైవు వెళ్లే మార్గాల మూసివేత
కాగా, ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఫార్ములా-ఈ పోటీలకు సన్నాహకంగా భావిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌ను ఇటీవల నిర్వహించారు. అయితే, ప్రధాన పోటీలు జరగకుండానే అవి ముగిశాయి. సమయాభావానికి తోడు, క్వాలిఫయింగ్ రేస్‌లో కొత్త ట్రాక్‌పై కార్లు పలుమార్లు ఢీకొని రేసర్లకు గాయాలయ్యాయి. దీంతో రేసింగ్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇప్పుడీ పోటీలను తిరిగి 10, 11 తేదీల్లో నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.