షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్.. ఢిల్లీకి రావాలని పిలుపు!
- షర్మిలతో 10 నిమిషాలు మాట్లాడిన మోదీ
- టీఆర్ఎస్ దాడి నేపథ్యంలో షర్మిలకు పరామర్శ
- ధైర్యంగా ఉండాలన్న ప్రధాని
ఈ నేపథ్యంలో, షర్మిలను ప్రధాని ఫోన్ ద్వారా పరామర్శించినట్టు తెలుస్తోంది. ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు. ఢిల్లీకి రావాలని ఆమెకు సూచించారు. తనకు అండగా నిలిచి, పరామర్శించిన ప్రధానికి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీకి వచ్చి కలుస్తానని చెప్పారు. ఏదేమైనప్పటికీ షర్మిలకు మోదీ ఫోన్ చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.