నేడు జగన్, చంద్రబాబు ఢిల్లీకి పయనం
- జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని అధ్యక్షతన సమావేశం
- సమావేశానికి హాజరవుతున్న జగన్, చంద్రబాబు
- సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో సమావేశం
ఈ సమావేశంలో పాల్గొనే నిమిత్తం జగన్ ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. మరోపక్క, చంద్రబాబు కాసేపటి క్రితం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. సమావేశం ముగిసిన వెంటనే జగన్ ఢిల్లీ నుంచి తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.
జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప అమీన్ పీర్ దర్గాలో పెద్ద ఉర్సు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరవుతారు.