నాయిస్ స్మార్ట్ వాచ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా విరాట్ కోహ్లీ
- ఇప్పటికీ తగ్గని కోహ్లీ బ్రాండ్ వాల్యూ
- నాయిస్ తో ఒప్పందాన్ని నిర్ధారించిన కోహ్లీ
- ఈ నాయిస్ నన్ను కూడా కదిలించిందంటూ వ్యాఖ్య
తమ సంస్థకు ప్రచారకర్తగా టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ వ్యవహరించనుండడం తమను ఉద్విగ్నతకు గురిచేస్తోందని నాయిస్ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ఖత్రీ అన్నారు.
ఈ ఒప్పందంపై కోహ్లీ ట్వీట్ చేశాడు. "ఇప్పుడు నేను అధికారికంగా నాయిస్ మేకర్ ను అయ్యాను. ఈ నాయిస్ నన్ను కూడా కదిలించింది... భారత్ లో నెం.1 స్మార్ట్ వాచ్ బ్రాండ్ లో ఇప్పుడు నేను ఒక భాగమే" అని వివరించారు.