తండ్రి అయిన టాలీవుడ్ సింగర్ రేవంత్
- పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేవంత్ భార్య అన్విత
- ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రేవంత్
- బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే రేవంత్ భార్యకు సీమంతం
చిన్నప్పుడే తాను తండ్రిని కోల్పోయానని... తండ్రి లేని లోటు ఎలా ఉంటుందో తనకు తెలుసని... అందుకే 'నాన్నా' అని ఎప్పుడెప్పుడు పిలిపించుకోవాలా అనే ఆత్రుతతో ఉన్నానని రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో చెప్పాడు. ఇప్పుడు ఆయన కల నెరవేరింది. నాన్నా అని పిలిచేందుకు చిన్నారి ఆ ఇంట అడుగుపెట్టింది. తనకు కూతురు పుట్టిందని తెలిస్తే రేవంత్ ఎంత సంతోషిస్తాడో అని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.