తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో 'లవ్ టుడే' రాబట్టిన నెట్ ఇదే!
- ప్రేమకథగా రూపొందిన 'లవ్ టుడే'
- స్మార్టు ఫోన్ ప్రేమ వ్యవహారాలే ప్రధానమైన కథాంశం
- ఈ జనరేషన్ కి కనెక్ట్ అయిన కంటెంట్
- తెలుగులోను భారీ వసూళ్లను రాబడుతున్న సినిమా
స్మార్టు ఫోన్ ద్వారా నడుస్తున్న ఈ తరం ప్రేమ వ్యవహారాలను సరదాగా ఆవిష్కరిస్తూ సందడి చేస్తున్న సినిమా ఇది. యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడంతో, తమిళనాట ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. తెలుగులోను మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లో 7.4 కోట్ల నెట్ ను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. తమిళంలో కేవలం 7 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, అక్కడ 50 కోట్ల మార్కును టచ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇక తెలుగులోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుండటం విశేషం.