నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు

  • ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటన
  • ఇప్పటికే 60 వేలకు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయన్న సీఎస్
  • త్వరలో 16,940 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని వెల్లడి
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జాతర కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా వున్న పోస్టుల్లో 60 వేల ఖాళీల భర్తీకి విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ కాగా... తాజాగా 16 వేలకు పైగా ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఓ కీలక ప్రకటన చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16,940 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 90 వేల ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని, అందులో భాగంగా విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగానే ఇఫ్పటికే చాలా శాఖలకు చెందిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

Telangana
TRS
KCR
TS CS
Somesh Kumar

More Telugu News