సరస్సులో ఈతకు దిగి.. అమెరికాలో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల మృతి
- ఇద్దరూ మంచి స్నేహితులని కుటుంబ సభ్యుల వెల్లడి
- ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారని పేర్కొన్న బంధువులు
- వారాంతంలో పార్టీ.. సరస్సులో ఈత కొడుతూ గల్లంతు
- డెడ్ బాడీలను వెలికి తీసిన పెట్రోలింగ్ పోలీసులు
ఒడ్డుకు చేరిన స్నేహితుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు సరస్సులో నుంచి శివదత్త మృతదేహాన్ని వెలికితీశారు. ఉత్తేజ్ కోసం చాలాసేపు గాలించినా.. ఆదివారం రాత్రికి కానీ మృతదేహం లభించలేదు. శివదత్త, ఉత్తేజ్ ల మరణ వార్త తెలిసి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుల మృతదేహాలను దేశానికి తీసుకువచ్చేందుకు సాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్, సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు.