ఫస్టులుక్ పోస్టర్ వదులుతున్న వెంకట్ ప్రభు!
- షూటింగు దశలో చైతూ 22వ సినిమా
- రెండోసారి ఆయన జోడీకట్టిన కృతి శెట్టి
- తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం
- సంగీత దర్శకులుగా ఇళయరాజా - యువన్ శంకర్ రాజా
- ఈ నెల 23వ తేదీన టైటిల్ పోస్టర్ రిలీజ్
ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. ఇక ఇప్పుడు ఒక టైటిల్ ను సెట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ ను ఈ నెల 23వ తేదీన రివీల్ చేస్తూ, ఆ రోజున ఉదయం 10:18 నిమిషాలకు ఫస్టులుక్ పోస్టర్ ను వదలనున్నట్టుగా, ప్రీ లుక్ ద్వారా తెలియజేశారు.
'బంగార్రాజు' తరువాత చైతూ - కృతి శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ఇది. అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. ప్రియమణి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇళయరాజా - యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని సమకూర్చుతుండటం విశేషం. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.