ప్రేమదేశం 'అబ్బాస్' కు శస్త్రచికిత్స
- బైక్ పై నుంచి పడిన అబ్బాస్
- కాలికి గాయం.. విపరీతమైన నొప్పి
- సర్జరీ అవసరమన్న వైద్యులు
తాజాగా, అబ్బాస్ ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. హాస్పిటల్ బెడ్ పై ఒక ఫొటో, వాకింగ్ స్టిక్ నడుస్తూ మరో ఫొటో కనిపిస్తున్నాయి. దీని గురించి అబ్బాస్ వివరణ ఇచ్చారు.
బైక్ పై నుంచి పడి గాయపడ్డానని, కొన్నిరోజులుగా విపరీతమైన కాలి నొప్పితో బాధపడుతున్నానని వెల్లడించారు. డాక్టర్లు శస్త్రచికిత్స తప్పనిసరి అని చెప్పారని తెలిపారు. సర్జరీ అనగానే గందరగోళానికి లోనయ్యానని, అయితే సర్జరీ చేయించుకున్నాక ఎంతో ఉపశమనం పొందానని పేర్కొన్నారు. డాక్టర్లకు థాంక్స్ చెప్పుకుంటున్నాను అని వివరించారు.
కాగా, ఓ దశలో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అబ్బాస్ కాలక్రమంలో అవకాశాలు రాక, ఎవరినీ అడగలేక చిత్ర రంగానికి దూరమయ్యాడు. యాడ్స్ కూడా లేకపోవడంతో భారత్ లో ఉండలేక కుటుంబంతో సహా విదేశాల్లో స్థిరపడ్డాడు.