ప్రేమదేశం 'అబ్బాస్' కు శస్త్రచికిత్స
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమదేశం 'అబ్బాస్' కు శస్త్రచికిత్స

Actor Abbas gets surgery to his injured leg
  • బైక్ పై నుంచి పడిన అబ్బాస్
  • కాలికి గాయం.. విపరీతమైన నొప్పి 
  • సర్జరీ అవసరమన్న వైద్యులు
యూత్ ఫుల్ లవ్ స్టోరీతో 1996లో వచ్చిన ప్రేమదేశం చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన అబ్బాస్ ఒక్క సినిమాతో స్టార్ డమ్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన అబ్బాస్ క్రమంగా తెరమరుగయ్యాడు. కొన్నాళ్ల పాటు హార్పిక్ బాత్రూం క్లీనర్ యాడ్ లో కనిపించాడు. 

తాజాగా, అబ్బాస్ ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. హాస్పిటల్ బెడ్ పై ఒక ఫొటో, వాకింగ్ స్టిక్ నడుస్తూ మరో ఫొటో కనిపిస్తున్నాయి. దీని గురించి అబ్బాస్ వివరణ ఇచ్చారు. 

బైక్ పై నుంచి పడి గాయపడ్డానని, కొన్నిరోజులుగా విపరీతమైన కాలి నొప్పితో బాధపడుతున్నానని వెల్లడించారు. డాక్టర్లు శస్త్రచికిత్స తప్పనిసరి అని చెప్పారని తెలిపారు. సర్జరీ అనగానే గందరగోళానికి లోనయ్యానని, అయితే సర్జరీ చేయించుకున్నాక ఎంతో ఉపశమనం పొందానని పేర్కొన్నారు. డాక్టర్లకు థాంక్స్ చెప్పుకుంటున్నాను అని వివరించారు. 

కాగా, ఓ దశలో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అబ్బాస్ కాలక్రమంలో అవకాశాలు రాక, ఎవరినీ అడగలేక చిత్ర రంగానికి దూరమయ్యాడు. యాడ్స్ కూడా లేకపోవడంతో భారత్ లో ఉండలేక కుటుంబంతో సహా విదేశాల్లో స్థిరపడ్డాడు.
Abbas
Surgery
Leg
Injury
Actor

More Telugu News