Sharmila: 'నాలుగు స్తంభాలాట' అనే సినిమాను కేసీఆర్ విడుదల చేశారు: షర్మిల

TRS MLAs poaching is false says YS Sharmila
షార్ట్స్‌లో చూడండి
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు జరిగాయనే వార్త తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈ వ్యవహారం జరిగిందనే వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దీనిపై ప్రస్తుతం విచారణ కూడా జరుగుతోంది. ఈ అంశంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 

ఎమ్మెల్యేలతో 'నాలుగు స్తంభాలాట' అనే సినిమాను కేసీఆర్ విడుదల చేశారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఒక బూటకమని అన్నారు. ఈ అంశంపై కేసీఆర్ చెపుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదని చెప్పారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కనిపించడం లేదనే విషయాన్ని పోలీసులు గమనించాలని అన్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు బాలకిషన్ బ్యాంక్ బ్యాలెన్స్ లక్ష రూపాయలు కాగా... ఇప్పుడు వందల కోట్లు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు.
Go Back to Shorts
Sharmila
YSRTP
KCR
TRS
MLAs Poaching

More Telugu News