పొన్నియన్ సెల్వన్ రెండో భాగం విడుదల ఎప్పుడంటే?
- ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో పీఎస్2
- ఏప్రిల్ 28న విడుదలయ్యే అవకాశం
- రూ. 450 కోట్లు వసూలు చేసిన తొలి భాగం
పీఎస్1 ప్రమోషన్స్ సందర్భంగా, మణి రణం మొదటి భాగం విడుదలైన ఆరు నుంచి తొమ్మిది నెలల తర్వాత రెండవ భాగాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ లెక్కన వచ్చే వేసవిలోనే పీఎస్2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పొన్నియన్ సెల్వన్ కల్కి కృష్ణమూర్తి రాసిన అదే పేరుతో ప్రసిద్ధ తమిళ సాహిత్య నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రకాష్ రాజ్, జయరామ్, శరత్ కుమార్, ప్రభు, ఐశ్వర్యలక్ష్మి, శోభిత ధూళిపాళ, విక్రమ్ ప్రభు సహాయక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చారు.