రేపు ఒక్కరోజే 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- తెలంగాణలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు
- వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న కేసీఆర్
- రేపటి నుంచి ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యాబోధన
- మెడికల్ కాలేజీలకు జిల్లా ఆసుపత్రుల అనుసంధానం
సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ఒకేసారి ఈ మెడికల్ కాలేజీల్లో తరగతులను ప్రారంభించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాదు ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ఆన్ లైన్ ద్వారా ఆయా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యాబోధనను లాంఛనంగా ప్రారంభిస్తారు.
కాగా, రూ.4,080 కోట్ల వ్యయంతో ఈ వైద్య కళాశాలలను నిర్మించారు. వీటికి ఆయా జిల్లాల ఆసుపత్రులను అనుసంధానం చేశారు. నూతన మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో 1,200 మెడికల్ సీట్లను కేటాయించారు.