Krishna: కృష్ణ గారి గురించి అభిమానులంతా దేవుడ్ని ప్రార్థించండి: నరేశ్

Naresh opines on Krishna health condition
షార్ట్స్‌లో చూడండి
తెలుగు చలనచిత్ర పరిశ్రమ తొలి సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. దీనిపై సీనియర్ నటుడు నరేశ్ స్పందించారు. ప్రస్తుతం కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అన్నారు. పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ శ్వాస తీసుకుంటున్నారని వెల్లడించారు. రేపు ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగవుతుందని భావిస్తున్నామని తెలిపారు. 

కృష్ణ గారు రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ ధైర్యశాలి, సాహసవంతుడు అని నరేశ్ వివరించారు. ఆయన ఓ పోరాట యోధుడని, ఈ విషమ పరిస్థితి నుంచి క్షేమంగా బయటికి వస్తారని నమ్ముతున్నానని తెలిపారు. కృష్ణ గారి ఆరోగ్యం కోసం అభిమానులంతా దేవుడిని ప్రార్థించండి అని పిలుపునిచ్చారు. 

అటు, కృష్ణకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి వర్గాలు కూడా స్పందించాయి. కృష్ణ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కు గురయ్యారని, తాము అందిస్తున్న ప్రపంచస్థాయి వైద్యం పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైద్యులు తెలిపారు.
Go Back to Shorts
Krishna
Naresh
Health
Superstar
Tollywood

More Telugu News