ప్రధాని మోదీకి అపురూపమైన కానుకను బహూకరించిన దుబ్బాక ఎమ్మెల్యే
- హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ
- బేగంపేటలో బీజేపీ స్వాగత సభ
- మోదీ చెంత శ్రీరాముడు ఉన్నట్టుగా ఓ చిత్రపటం
- బహూకరించిన రఘునందన్
ఈ విశిష్ట కానుక అందుకున్న మోదీ ఎంతో సంతోషించారు. రఘునందన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మునుగోడులో ఓటమిపాలైనప్పటికీ తెలంగాణ బీజేపీ శ్రేణులను మోదీ అభినందించారు. నికార్సయిన పోరాటం కనబరిచారంటూ కొనియాడారు. మున్ముందు కూడా ఇదే తరహాలో పోరాడాలంటూ ప్రోత్సాహ వచనాలు పలికారు.