రోహిత్ రెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో భద్రత పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- రూ.400 కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం
- నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర
- ఎమ్మెల్యేల భద్రతపై ఆందోళనలు
- ఎస్కార్ట్ సౌకర్యం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం
కొన్నిరోజుల కిందటే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చిన సర్కారు, తాజాగా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా భద్రతను పెంచింది. గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించింది. దాంతో పాటు ఎస్కార్ట్ సౌకర్యం కూడా కల్పించింది. వారి నివాసాల వద్ద కూడా భద్రతను పెంచింది.