ఘజియాబాద్ లో దొంగల ‘న్యూస్ పేపర్’ ట్రిక్
- ఇంటి ఆవరణలో న్యూస్ పేపర్ విడిచి పెట్టిన దొంగలు
- ఆ పేపర్ వేసిన చోటే ఉండిపోవడంతో ఎవరూ లేరని నిర్ధారణ
- ఇంట్లోకి చొరబడి విలువైన ఆభరణాలన్నీ చోరీ
ఇంటి ఆవరణలో ఓ న్యూస్ పేపర్ పడి ఉండడాన్ని యజమానులు గుర్తించారు. అక్టోబర్ 29వ తేదీతో అది ఉంది. అంటే ఇంట్లోని వారు యాత్రకు వెళ్లిన రోజే దొంగలు ఆ ఇంటిని పరిశీలించినట్టు తెలుస్తోంది. న్యూస్ పేపర్ విడిచిపెట్టి, దాన్ని తీసుకున్నదీ, లేనిదీ మరుసటి రోజు వచ్చి వారు పరిశీలించారు. వేసిన చోటే ఉండడంతో ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఈ దొంగతనానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఉంటే న్యూస్ పేపర్ అక్కడ ఉండేది కాదు. నిజానికి ఆ ఇంటి వారు ఏ వార్తా పత్రికను కూడా తెప్పించుకోవడం లేదు.