నా జీవితంలో ముఖ్యమైన రోజు ఇది: ఖర్గే
- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తొలి ప్రసంగం
- తనపై విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపిన ఖర్గే
- పార్టీ అధ్యక్ష పదవి చాలా పెద్ద బాధ్యత అని వ్యాఖ్య
- ఒక కార్మికుడి కొడుకు ఇలా పార్టీ బాధ్యతలు చేపట్టడం ఊహించలేమని వెల్లడి
కాంగ్రెస్ వారసత్వాన్ని..
కాంగ్రెస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వించదగ్గ విషయమని ఖర్గే పేర్కొన్నారు. సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు. దేశ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ తో లక్షలాది మంది కలిసి నడుస్తున్నారని తెలిపారు. రాహుల్ భారత్ జోడో యాత్ర లక్ష్యాన్ని వృధా కానివ్వబోమని ఖర్గే ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం.. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా పెద్ద బాధ్యతని పేర్కొన్నారు. ఇంతకాలం తాను చిత్తశుద్ధితో తన విధులను నిర్వర్తించానని, ఇప్పుడు ఖర్గే కూడా అదేవిధంగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.