Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం.. పది దుకాణాలు ఆహుతి

Fire accident in narasaraopet ten shops burnt
  • షార్ట్ సర్క్యూట్  కారణంగా అర్ధరాత్రి చెలరేగిన మంటలు
  • మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
  • బాధితులకు పరిహారం ఇస్తామన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
పల్నాడు జిల్లా నరసరావుపేటలో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పది దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఫ్లై ఓవర్ కిందనున్న ఓ దుకాణంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అవి క్రమంగా పక్కనున్న షాపులకు కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

అలాగే, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రమాద స్థలానికి చేరుకుని కాలిబూడిదైన దుకాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులతో సమావేశమై నష్టాన్ని అంచనా వేస్తామని, అనంతరం బాధితులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Guntur District
Narasaraopet
Palnadu Dist
Fire Accident

More Telugu News