ట్విట్టర్ వేదికగా మహిళా కమిషన్‌పై జనసేన ప్రశ్నల వర్షం
- జనసేనాని పవన్‌కు నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
- వైసీపీ మంత్రులు నోటితో చెప్పలేని అసభ్య పదజాలాన్ని ఉపయోగించినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్న
- రెండుమూడుసార్లు అత్యాచారాలు జరుగుతుంటాయని మహిళా మంత్రి అన్నప్పుడు కమిషన్ ఎక్కడుందని నిలదీత
రెండు, మూడు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయని మహిళా మంత్రి వ్యాఖ్యానించినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించింది. సుగాలి ప్రీతి విషయంలో మహిళా కమిషన్ ఏం చేసిందని నిలదీసింది. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో దళిత బాలికపై ఏడాదిపాటు అత్యాచారం జరిగినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించింది. గతేడాది ఆగస్టులో గుంటూరులో 20 ఏళ్ల మహిళా ఇంజినీరింగ్ విద్యార్థిపై పట్టపగలు దుండగుడు దాడిచేసి కడుపుపై ఆరుసార్లు కత్తితో పొడిచినప్పుడు ఏపీ మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయవాడలో 23 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని జనసేన తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నల వర్షం కురిపించింది.