పాక్ తో వరల్డ్ కప్ మ్యాచ్.. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- గత అనుభవాల దృష్ట్యా ఛేజింగ్ కు మొగ్గు చూపిన రోహిత్ శర్మ
- తుది జట్టులో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు
- కీపర్ గా పంత్ కు బదులు దినేశ్ కార్తీక్ కు మొగ్గు
ఇక ఈ మ్యాచ్ లో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు సహా ఏడుగురు బ్యాటర్లతో బరిలోకి దిగింది. కీపర్ గా రిషబ్ పంత్ కు బదులు సీనియర్ దినేశ్ కార్తీక్ ను తీసుకుంది. మరోవైపు పాకిస్థాన్ కూడా ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు, ఆరుగురు బ్యాటర్లను ఎంచుకుంది.
భారత్ తుది జట్టు: 1. రోహిత్ శర్మ, 2. కేఎల్ రాహుల్, 3. విరాట్ కోహ్లీ, 4. సూర్యకుమార్ యాదవ్, 5. హార్దిక్ పాండ్యా, 6. దినేష్ కార్తీక్, 7. అక్షర్ పటేల్, 8. ఆర్ అశ్విన్, 9. మహ్మద్ షమీ, 10. భువనేశ్వర్ కుమార్, 11. అర్ష్‌దీప్ సింగ్.
పాకిస్థాన్ తుది జట్టు: 1. మహ్మద్ రిజ్వాన్, 2. బాబర్ ఆజం, 3. షాన్ మసూద్, 4. షాదాబ్ ఖాన్, 5. హైదర్ అలీ, 6. ఇఫ్తికర్ అహ్మద్, 7. మహ్మద్ నవాజ్, 8. ఆసిఫ్ అలీ, 9. షాహీన్ షా ఆఫ్రిది, 10. నసీమ్ షా, 11. హరీస్ రవూఫ్.