కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు చెప్పులు ధరించను: మంత్రి సత్యవతి రాథోడ్
- భువనగిరి జిల్లాలో నిన్న ప్రచారం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్
- సెప్టెంబరు 17 నుంచి దీక్షలో ఉన్నానన్న మంత్రి
- గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో చేస్తున్నారన్న ప్రశంస
ఇది విలేకరుల దృష్టిని ఆకర్షించింది. చెప్పులు ఎందుకు ధరించలేదన్న ప్రశ్నకు మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను పాదరక్షలు ధరించబోనని అన్నారు. సెప్టెంబరు 17 నుంచే దీక్షను ప్రారంభించినట్టు చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. వారికి ఆరు శాతంగా ఉన్న రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచారని గుర్తు చేశారు. వారి కోసం గిరిజన బంధు పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్టు చెప్పారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారన్న సత్యవతి రాథోడ్.. కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అయ్యే వరకు పాదరక్షలు ధరించబోనని స్పష్టం చేశారు.