జపనీయులను ఉరకలెత్తిస్తున్న ఆర్ఆర్ఆర్

  • నాటు నాటు పాటకు డ్యాన్స్ కట్టిన ప్రముఖ యూట్యూబర్ మాయో 
  • రాజమౌళి, తారక్, చరణ్ ఇంటర్వ్యూ తర్వాత ప్రత్యేక వీడియో
  • 21న విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా
ఆర్ఆర్ఆర్ మూవీలో 'నాటు నాటు' సాంగ్ గుర్తుండే ఉంటుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరో ఈ పాటకు స్టెప్పులేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలసి వేసిన స్టెప్పులకు ఎందరో ఫిదా అయ్యారు. ఇప్పుడు ఇంచుమించు జపాన్ లోనూ ఇదే తరహా వాతావరణం కనిపిస్తోంది. ప్రముఖ జపనీస్ యూట్యూబర్ మాయో నాటు నాటు సాంగ్ కు ఇరగదీసేలా స్టెప్పులు వేసింది. సహచరుడితో కలసి రద్దీగా ఉన్న రహదారిపై డ్యాన్స్ చేసిన వీడియోను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది.

‘‘జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా రామ్ చరణ్, తారక్, ఎస్ ఎస్ రాజమౌళిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేము ఎంతో ఉత్తేజానికి గురయ్యాం. ఇంటికి తిరిగి వెళుతూ మరో వీడియో చేశాం’’ అంటూ మాయో ట్వీట్ చేసింది. ఈ వీడియోను ఇప్పటికి 47 వేల మందికి పైగా చూశారు. భారత సినిమాలు జపాన్ లో ఆదరణ పొందడం గతంలోనూ జరిగింది. ముఖ్యంగా రజనీకాంత్ సినిమాలకు అక్కడ పెద్ద ఫాలోయింగ్ ఉంది.

Japanese YouTuber
mayo
dance
naatu naatu
RRR

More Telugu News