Telangana: బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బుధవారం బీజేపీలో చేరిపోయారు. బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన నర్సయ్య గౌడ్... బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ సమీపించిన నేపథ్యంలో ఈ పరిణామం బీజేపీకి కలిసి వస్తుందని అంటున్నారు.  

ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిష్పక్షపాతంగా పనిచేయడమే తన ప్రధాన కర్తవ్యమని ఆయన చెప్పారు. తాను ఎంపీగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులను భువనగిరికి తీసుకువచ్చానని చెప్పారు. సబ్ కా సాత్... సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళతానని ఆయన తెలిపారు.
Telangana
BJP
TRS
Boor Narasiah Goud
Bhongir
Bandi Sanjay
G. Kishan Reddy
Tarun Chugh

More Telugu News