చిరంజీవిగారితో సీన్ టెన్షన్ పెట్టేసింది: నటి తులసి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవిగారితో సీన్ టెన్షన్ పెట్టేసింది: నటి తులసి

Tulasi Interview
  • 'శంకరాభరణం'తో తులసికి మంచి పేరు
  • హీరోయిన్ గాను మెప్పించిన తులసి 
  • కేరక్టర్ ఆర్టిస్టుగా ప్రస్తుతం బిజీ
  • తన బాల్యాన్ని గురించిన ప్రస్తావన
తెలుగుతో పాటు వివిధ భాషల్లో బాలనటిగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా తులసికి మంచి పేరు ఉంది. దాదాపు 300 పైగా సినిమాలలో ఆమె నటించారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తులసి మాట్లాడుతూ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తులసి మాట్లాడుతూ .. " బాలనటిగా 'శంకరాభరణం' సినిమా నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత నేను బిజీ అయ్యాను. 

'కోతలరాయుడు' సినిమాలో  నేను చిరంజీవి కాంబినేషన్లో ఒక సీన్ చేశాను. 'బాబాయ్ నువ్వెందుకు జైలుకు వెళుతున్నావ్' అంటూ ఏడ్చే డైలాగ్ అది. ఆ డైలాగ్ నేను సరిగ్గా చెప్పకపోవడం వలన అప్పటికే ఏడు టేకులయ్యాయి. అది చూసి మా అమ్మ నన్ను తిట్టేసింది. ఇక నువ్వు సినిమాలు చేయవలసిన అవసరం లేదని కోప్పడింది. దాంతో నాకు ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. అదో పెద్ద అవమానంగా అనిపించడంతో, మరో టేక్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను.

విశ్వనాథ్ గారిని ఇప్పటికీ కూడా నాన్న అనే పిలుస్తాను. ఇక బాపుగారి ఇంట్లో కూడా నాకు ఎంతో చనువు ఉండేది. అలాగే దాసరి నారాయణ రావుగారి ఇంట్లోను  .. కృష్ణగారి ఇంట్లోను కలిసిపోయేదానిని. ఇక ఈ జనరేషన్ విషయానికొస్తే ప్రభాస్ .. మహేశ్ .. బన్నీ అందరూ కూడా నన్ను ఎంతగానో అభిమానిస్తారు .. అంతగానూ గౌరవిస్తారు. వాళ్ల కాంబినేషన్లో నటించడం కూడా భగవంతుడి అనుగ్రహంగానే నేను భావిస్తూ ఉంటాను" అంటూ చెప్పుకొచ్చారు.
Tulasi
Actress
Tollywood

More Telugu News