ప్రపంచ కప్‌లో మరో సంచలనం.. వెస్టిండీస్‌ను చిత్తు చేసిన స్కాట్లాండ్
- 42 పరుగుల తేడాతో చిత్తయిన విండీస్
- 161 పరుగుల లక్ష్య ఛేదనలో 118కే ఆలౌట్
- నిన్న శ్రీలంకకు షాకిచ్చిన నమీబియా
అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. దాంతో, ప్రపంచ కప్ లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. జాసన్ హోల్డర్ (38), కైల్ మెయిర్స్ (20) తప్పితే మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ మూడు, అలెగ్జాండర్ లీసాక్ రెండు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించారు.