అమరావతే ఏపీకి ఏకైక రాజధాని... సీపీఐ మహాసభల్లో తీర్మానం
- విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు
- అమరావతిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముప్పాళ్ల నాగేశ్వరరావు
- వివిధ రాష్ట్రాల ప్రతినిధుల ఆమోదం
అమరావతి రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్టచర్యలను ఉపసంహరించుకోవాలని సీపీఐ నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ సానుకూలంగా స్పందించి సత్వరమే నిర్మాణ పనులు కొనసాగించాలని సూచించారు.