మాకు ప్రపంచ కప్ కంటే బుమ్రా కెరీరే ముఖ్యం: భారత కెప్టెన్ రోహిత్
- సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డ బుమ్రా
- టీ20 ప్రపంచకప్ నకు దూరమైన స్టార్ పేసర్
- రిస్క్ తీసుకోవద్దనే అతని విషయంలో తొందరపడలేదన్న రోహిత్
‘బుమ్రా నాణ్యమైన ఆటగాడు. అతను చాలా సంవత్సరాలుగా చాలా బాగా ఆడుతున్నాడు. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు గాయాలు అవుతుంటాయి. అవి ఆటలో సహజమే. బుమ్రా గాయం గురించి మేము చాలా మంది నిపుణులతో మాట్లాడాము. కానీ మాకు సానుకూల ఫలితం రాలేదు. ఫలితంగా ప్రపంచ కప్ కు అతను దూరం అయ్యాడు. ఈ టోర్నీ మాకు చాలా ముఖ్యమైనది. కానీ అతని కెరీర్ మాకు మరింత ముఖ్యమైనది. ఎందుకంటే అతని వయస్సు 28 సంవత్సరాలు మాత్రమే. అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది. కాబట్టి, మేము ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. వైద్య నిపుణులు కూడా అదే సూచించారు. మున్ముందు ఇంకా చాలా ఆడుతాడు. దేశాన్ని గెలిపిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఈ టోర్నీలో తను లేకపోవడం మాకు కచ్చితంగా ఎదురు దెబ్బే’ అని రోహిత్ స్పష్టం చేశాడు.