బీసీసీఐ చీఫ్ గా రోజర్ బిన్నీ.. కార్యదర్శిగా జైషా! నేడు నామినేషన్లు
- వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా
- ఐపీఎల్ చైర్మన్ గా అరుణ్ ధుమాల్
- ఖరారైన అభ్యర్థిత్వాలు
రోజర్ బిన్నీతోపాటు, బీసీసీఐ ఆఫీసు బేరర్ల పోస్ట్ లకు అభ్యర్థిత్వం ఖరారైన వారు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బీసీసీఐ పదవులకు ఎన్నిక ఈ నెల 18న జరగనుంది. జాయింట్ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ట్రెజరర్ గా ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ గా అరుణ్ ధుమాల్ అభ్యర్థిత్వం ఖరారైనట్టు తెలుస్తోంది. రోజర్ బిన్నీ (67) 1980-87 మధ్య 27 టెస్ట్ లు, 72 ఓడీఐలు ఆడారు. 1983 ప్రపంచకప్ లో 8 మ్యాచుల్లో 18 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారు. టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలవడం ద్వారా భారత్ విజయంలో కీలకంగా వ్యవహరించారు.