టీవీ ఛానల్ పెడుతున్నా: విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
- పేపర్, టీవీ ఉందని రామోజీరావు దుష్ప్రచారం చేస్తున్నారన్న విజయసాయి
- రామోజీ ఉన్న రంగంలోకే ప్రవేశిస్తున్నానని వెల్లడి
- ఎవరి ఛానల్ ఎలా పని చేస్తుందో చూసుకుందామని సవాల్
తాను ఇంతవరకు వ్యాపారం చేయలేదని... ఏ మీడియా రంగంలో అయితే రామూ (రామోజీరావు) ఉన్నారో... అదే రంగంలోకి తాను ప్రవేశించబోతున్నానని చెప్పారు. మీ ఛానల్ ఎలా పనిచేస్తుందో ... తాను పెట్టబోయే ఛానల్ ఎలా పని చేస్తుందో చూసుకుందాం రామూ అంటూ సవాల్ విసిరారు. మీ రంగంలోకి తాను ఎంటర్ కాబోతున్నానని వ్యాఖ్యానించారు.
మరోవైపు, విజయసాయిరెడ్డి ప్రకటనపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నువ్వు పెడుతున్న ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.