సంక్రాంతికి 'వారసుడు'రావడం ఖాయమే!
- 'వారసుడు'గా రానున్న విజయ్
- తమిళ టైటిల్ గా 'వరిసు'
- కథానాయికగా సందడి చేయనున్న రష్మిక
- సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల
తమిళంలో ఈ సినిమాకి 'వరిసు' అనే టైటిల్ ను సెట్ చేశారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. అయితే అప్పటికి ఈ సినిమా పూర్తి కావడం కష్టమేననే టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా అదే రోజున థియేటర్లకు రావడం ఖాయమని సమాచారం.
ఈ నెలాఖరుతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందట. దీపావళికి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా, ప్రభు .. ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.