మెక్సికోలో దారుణం.. దుండగుల కాల్పుల్లో చట్టసభ్యురాలు, మేయర్ సహా 21 మంది మృతి
- మేయర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా దుండగుల కాల్పులు
- మేయర్, ఆయన తండ్రి సహా 21 మంది మృతి
- మరో ఘటనలో చట్టసభ్యురాలిని కాల్చి చంపిన దుండగులు
2015-17 మధ్య గెరెరోను నాశనం చేసిన లాస్ టెక్విలెరోస్ క్రిమినల్ గ్యాంగుపై ఈ దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ నాయకుడు రెబెలో జాకోబో డి అల్మోంటో హతమయ్యే వరకు ఈ ప్రాంతంలో మేయర్‌లను ఈ గ్యాంగు బెదిరిస్తూ ఉండేది. మేయర్ అల్మెడాకు చెందిన పార్టీ పార్టిడో డి లా రెవెల్యూసియన్ డెమొక్రిటికా (పీఆర్‌డీ) ఈ ఘటనను ఖండించింది. కాగా, మోరెలోస్ రాష్ట్రంలోని క్యుర్నవాకాలో జరిగిన మరో ఘటనలో చట్టసభ్యురాలు గాబ్రియెలా మరీన్ ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఆమెను అతి సమీపం నుంచి కాల్చి చంపారు.