వైరల్ ఫొటో!.. తల్లి పాదాలకు బూట్లు తొడిగిన రాహుల్ గాంధీ!
- మాండ్యా జిల్లాలోని పాండపురలో పునఃప్రారంభమైన రాహుల్ యాత్ర
- కుమారుడితో కలిసి యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ
- తల్లి పాదాలకు రాహుల్ బూట్లు తొడిగి లేస్ కడుతుండగా క్లిక్‌మన్న కెమెరా
- కాంగ్రెస్ నేతలతో పాటు నెటిజన్లు కూడా షేర్ చేస్తున్న వైనం
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తల్లి పాదాలకు రాహుల్ గాంధీ బూట్లు తొడిగారు. తల్లి పాదాలకు బూట్లు తొడిగిన అనంతరం షూ లేస్ కడుతున్న సమయంలో తీసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫొటోను ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు అటు నెటిజన్లు కూడా షేర్ చేస్తున్నారు. వెరసి ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.