ఆ పార్టీలు కేసీఆర్ జాతీయ పార్టీలో విలీనం అవుతున్నాయా?
- తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ నేడే విలీనం అవుతుందని వార్తలు
- దక్షిణాదిలో మూడు, నాలుగు పార్టీలు ముందుకొచ్చే అవకాశం
- నేడు బీఆర్ఎస్ పై ప్రకటన చేయనున్న కేసీఆర్
ఈ క్రమంలో తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో వీసీకే.. బీఆర్ఎస్‌లో విలీన ప్రకటన చేయొచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తమిళనాడు తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారావును కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. దీనితోపాటు కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఓ పార్టీ కూడా నూతన జాతీయ పార్టీలో విలీనం అవుతాయన్న వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో సదరు పార్టీల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. మున్ముందు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాగా, బీఆర్‌ఎస్ ఏర్పాటు కార్యక్రమానికి కేసీఆర్ ఆహ్వానం మేరకు పలు రాష్ట్రాల నేతలు హైదరాబాద్ వచ్చారు. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, మాజీ మంత్రి రేవణ్ణ, పలువురు ఎమ్మెల్యేలు, తిరుమాళవన్, తమిళనాడుకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారు.