దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్ కు కోహ్లీ, కేఎల్ రాహుల్ లకు విశ్రాంతి

Team India rested Kohli and KL Rahul
దక్షిణాఫ్రికాతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో గెలిచింది. ఈ నేపథ్యంలో, ఇరుజట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ రేపు (అక్టోబరు 4) ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. 

ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా ఎలాంటి ప్రాధాన్యం లేని ఈ మ్యాచ్ కోసం జట్టులో కొన్ని మార్పులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లకు విశ్రాంతి కల్పించింది. మరికొన్నిరోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన బ్యాట్స్ మెన్ పై భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, రేపటి మ్యాచ్ లో కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ తుదిజట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి.
Go Back to Shorts
Team India
Virat Kohli
KL Rahul
3rd T20
South Africa

More Telugu News