Chilakaluripeta: చిలకలూరిపేటలో కలకలం రేపుతున్న చిన్నారి కిడ్నాప్

Boy kidnapped in Chilakaluripet
షార్ట్స్‌లో చూడండి
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు రాజీవ్ సాయి (8) అనే బాలుడిని కిడ్నాప్ చేశారు. రాజీవ్ తండ్రి చెన్నైలో ధాన్యం వ్యాపారం చేస్తున్నారు. దసరా పండుగ కోసం వీరి కుటుంబం చెన్నై నుంచి చిలకలూరిపేటకు వచ్చింది. పట్టణంలోని 13వ వార్డులో ఉన్న దేవాలయంలో రాజీవ్ తల్లిదండ్రులు పూజలు చేస్తున్న సమయంలో... బాలుడుని దుండగులు కిడ్నాప్ చేశారు. 

రాజీవ్ తల్లిందండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. తాము అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు కిడ్నాప్ కు గురి కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
Go Back to Shorts
Chilakaluripeta
Boy
Kidnap

More Telugu News