తమిళనాడు జాలర్ల వలకు చిక్కిన రూ.50 కోట్ల విలువైన అంబర్గ్రిస్
- సముద్రంలో వేటకు వెళ్లిన కడప్కాకం జాలర్లు
- 38.6 కిలోల అంబర్ గ్రిస్ లభ్యం
- స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు
తాజాగా ఇది కల్పాక్కం సమీపంలోని జాలర్ల వలకు చిక్కింది. దీని విలువ రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చెంగల్పట్టు జిల్లా కల్పాక్కం సమీపంలోని కడప్కాకం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్, మాయకృష్ణన్, కర్ణన్, శేఖర్ కలిసి శనివారం చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. వారి వలకు 38.6 కిలోల అంబర్గ్రిస్ పడింది. దీంతో వారు ఈ విషయాన్ని అచ్చిరుపాక్కం అటవీ అధికారులకు తెలియజేశారు. వారొచ్చి దీనిని స్వాధీనం చేసుకున్నారు.