'పొన్నియన్ సెల్వన్' పాత్రలో అశ్విన్... చిత్రాన్ని మెచ్చుకుంటూ క్రికెటర్ పోస్ట్
- శుక్రవారం విడుదలైన పొన్నియన్ సెల్వన్
- చిత్రాన్ని ఆకాశానికెత్తేస్తూ అశ్విన్ వరుస ట్వీట్లు
- ఓ పాత్రధారి వేషంలో కనిపిస్తూ వీడియోను విడుదల చేసిన వైనం
పనిలో పనిగా పొన్నియన్ సెల్వన్ సినిమాలో చాలా మంది ప్రముఖ నటులు ఉన్నారని తెలిపిన అశ్విన్... మీ అభిమాన నటుడు ఎవరు అంటూ ఓ ప్రశ్న సంధించాడు. అంతేకాకుండా సినిమాలోని ఓ ప్రధాన పాత్ర వేషధారణలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 19 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో పొన్నియన్ సెల్వన్ నవలను చదువుతూ అశ్విన్ కనిపించాడు.