Gas Cylinder: వంట గ్యాస్ సిలిండర్లపై పరిమితి విధించబోతున్న కేంద్రం?

New rules on LPG cylinder capping
షార్ట్స్‌లో చూడండి
వంట గ్యాస్ సిలిండర్లపై లిమిట్ ను విధించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మీడియాలో వస్తున్న కథనాలు నిజమే అయితే... ఒక కుటుంబం సంవత్సరానికి గరిష్ఠంగా 15 సిలిండర్లు మాత్రమే పొందగలుగుతుంది. నెలకు రెండుకు మించి సిలిండర్లను పొందలేరు. ఇప్పటివరకైతే ఎల్పీజీ సిలిండర్లపై ఎలాంటి కోటా లేకపోవడం గమనార్హం. ఒకవేళ ఎవరికైనా ఒక నెలలో రెండుకు మించి సిలిండర్లు అవసరమైతే... ఆ అవసరానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది. 

ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. గత ఐదేళ్ల కాలంలో 58 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. కేంద్ర పెట్రోలియం శాఖ అధికారిక డేటా ప్రకారం... 2017 ఏప్రిల్ 1 నుంచి 2022 జూలై  6 వరకు గ్యాస్ సిలిండ్ ధర 45 శాతం పెరిగింది. 2017 ఏప్రిల్ లో ఎల్పీజీ సిలిండర్ రూ. 723గా ఉండగా 2022 జూలై నాటికి రూ. 1,053కి పెరిగింది. అయితే సిలిండర్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే వ్యాట్, రవాణా ఛార్జీల కారణంగా సిలిండర్ ధరలో వ్యత్యాసం ఉంటుంది.
Go Back to Shorts
Gas Cylinder
Price
Cap
LPG

More Telugu News