ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీకి ప్రారంభోత్సవం చేయడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు: కాకాణి గోవర్ధన్
- చంద్రబాబు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే వస్తాయన్న మంత్రి
- తన హయాంలో ఎక్కువ మెడికల్ కాలేజీలు వచ్చాయని చంద్రబాబు చెపుతున్నారని విమర్శ
- బాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీని ఎన్టీఆర్ వారసులకు అప్పగించాలని డిమాండ్
తన హయాంలోనే ఎక్కువ మెడికల్ కాలేజీలు వచ్చాయని చంద్రబాబు చెపుతున్నారని... నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీని తామే కట్టామని చెప్పారని... ఇది పూర్తిగా అవాస్తవమని కాకాణి అన్నారు. ఆ మెడికల్ కాలేజీకి 2013 ఏప్రిల్ 3న శంకుస్థాపన చేశారని... 2013 ఆగస్ట్ 24న ఏసీ సుబ్బారెడ్డి మెమోరియల్ మెడికల్ కాలేజీగా నామకరణం చేశారని చెప్పారు. ఆ కాలేజీకి ప్రారంభోత్సవం చేయడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదని తెలిపారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీని ఎన్టీఆర్ వారసులకు అప్పగించాలని మంత్రి డిమాండ్ చేశారు.