వేడ్ దూకుడు... టీమిండియా ముందు భారీ లక్ష్యాన్నుంచిన ఆసీస్
- నాగ్ పూర్ లో 8 ఓవర్ల మ్యాచ్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా
- నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు
- 20 బంతుల్లో 43 పరుగులు చేసిన వేడ్
- అక్షర్ పటేల్ కు 2 వికెట్లు
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మాథ్యూ వేడ్ తన ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి దూకుడుగా ఆడాడు. వేడ్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అంతకుముందు, కెప్టెన్ ఆరోన్ ఫించ్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 31 పరుగులు చేశాడు. ఓపెనర్ కామెరాన్ గ్రీన్ 5, మ్యాక్స్ వెల్ 0, టిమ్ డేవిడ్ 2, స్టీవ్ స్మిత్ 8 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 2, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశారు.