Daggubati Purandeswari: పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు: జగన్ పై పురందేశ్వరి ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను తీర్చడంపై ప్రభుత్వానికి శ్రద్ధలేదని చెప్పారు. పేర్లను మార్చడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కరించడంపై లేదని అన్నారు. 

మద్య నిషేధం విధిస్తామని చెప్పిన జగన్... మహిళలను మోసం చేశారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పారు. రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. పారిశ్రామిక వేత్తలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు, భూకబ్జాలే కనిపిస్తున్నాయని విమర్శించారు.
Daggubati Purandeswari
BJP
Jagan
YSRCP

More Telugu News