జైలులో నా భర్త ప్రాణాలకు ముప్పు... ప్రత్యేక వసతులు కల్పించండి: హైకోర్టులో ఎమ్మెల్యే రాజా సింగ్ భార్య పిటిషన్
- విద్వేష వ్యాఖ్యల కేసులో అరెస్టయిన రాజా సింగ్
- కేసును సవాల్ చేస్తూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన భార్య ఉషాబాయి
- తాజాగా రాజా సింగ్ కు ప్రత్యేక వసతుల కోసం పిటిషన్
- తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసిన కోర్టు
జైలులో ఇతర ఖైదీలకు దూరంగా తన భర్తకు ఓ గదిని కేటాయించాలని ఉషాబాయి హైకోర్టును కోరారు. ప్రత్యేక గదితో పాటు అందులో మంచం, టేబుల్, కుర్చీ, వార్తా పత్రికలు, టీవీ, వంట చేసుకోవడానికి తగిన వసతులు కల్పించాలని ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై గురువారమే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. తమ వాదనలు వినిపించేందుకు తమకు మరింత సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరడంతో విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.