'పేసీఎం' అంటూ బొమ్మైకు వ్యతిరేకంగా బెంగళూరులో వెలసిన పోస్టర్లు
- ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో అవినీతి చోటుచేసుకుంటోందన్న కాంగ్రెస్
- పేసీఎం క్యూఆర్ కోడ్ స్థానంలో సీఎం బొమ్మై ఫొటో
- 40 శాతాన్ని ఇక్కడ స్వీకరిస్తామని యాడ్
ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందంటూ కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో విమర్శలను పెంచుతోంది. ఈ క్రమంలోనే ఈ పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ పోస్టర్లకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. ఈ పోస్టర్లను ప్రభుత్వ సిబ్బంది తొలగించారు.