మహిళ తియ్యని మాటలకు చిత్తయిన యువకుడు... అతడి నగ్న వీడియోలతో మహిళ బెదిరింపులు
- ఫోన్ ద్వారా యువకుడికి మహిళ పరిచయం
- క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం
- నగ్న వీడియోలు పంపాలని కోరిన మహిళ
- వీడియోలు పంపి లబోదిబోమన్న యువకుడు
- పోలీసులకు ఫిర్యాదు
కొన్నిరోజుల తర్వాత, నగ్న వీడియోలు తీసి పంపాలని ఆ యువకుడిని సదరు మహిళ కోరింది. ఆమె అడిగిందే తడవుగా పలు నగ్న వీడియోలు తీసి ఆమెకు పంపించాడు. అయితే అతడు ఏమాత్రం ఊహించని విధంగా ఆమె బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడింది. తనకు డబ్బు ఇవ్వకపోతే నగ్న వీడియోలు బయటపెడతానంటూ ఆ యువకుడ్ని బెదిరించసాగింది.
హడలిపోయిన ఆ యువకుడు ఒకసారి రూ.8 వేలు పంపాడు. అయినప్పటికీ ఆమె నుంచి బెదిరింపులు ఆగకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న తాడేపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.